17, ఏప్రిల్ 2010, శనివారం

బెంగుళుర్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం [match 52]


పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై మరో ఘనవిజయం ఖాతలో వెసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగుళుర్ తో జరిగిన మ్యచ్ లో 57 పరుగుల తేడాతో విజయం సాదించింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళుర్ ఆరంభం నుంచె వికెట్లు కోల్పోతూ ఓటమి పాలు అయ్యింది.ముంబై బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చెయడంతో బెంగుళుర్ ఏ దశలోను ప్రతిఘటించలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు నస్టానికి 134 పరుగులు చెసి ఓటమి చెవిచూసింది కొహ్లి 37 పరుగులు చెసి టాప్ స్కొరర్ గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చెసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నస్టానికి 192 పరుగుల భారీ స్కొర్ సాదించింది.మెక్ లరెన్ 40 పరుగులు, అంబటి రాయుడు 46 పరుగులు,పొలార్డ్ 20 పరుగులు చివర్లో డుమిని 42 పరుగులు వేగంగా చెయడంతో ముంబై భారీ సాదించింది.ఈ విజయంతో ముంబైకి 13 మ్యచ్ లలో 10 వ విజయం కాగ బెంగుళుర్ కి 14 మ్యచ్ లలో 7వ ఓటమి.

పంజాబ్ వర్సెస్ దెక్కన్ చార్జర్స్ ఫోటోస్ [match 51]








11, ఏప్రిల్ 2010, ఆదివారం

పంజాబ్ ఘన విజయం


ఐ.పి.యల్లో డిల్లీ పై గెలిచి పంజాబ్ హ్యట్రిక్ విజయాలను నమోదు చెసింది.మొదట బ్యాటింగ్ చెసిన డిల్లీని పంజాబ్ స్వల్ప స్కొరుకు కట్టడి చెసింది డిల్లీ జట్టులో గంభీర్ 26 పరుగులు .మన్ హస్ 26 పరుగులు చెసరు.పటాన్ 3 వికెట్లు చావ్లా 2 వికెట్లు తీసారు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 3 వికెట్ల కోల్పోయి విజయం సాదించింది.జయవర్దనె 38 పరుగులు సంగక్కర 33 పరుగులు యువరాజ్ 21{నాట్ ఔట్] పరుగులు చెసారు . డిల్లీకి ఇది వరుసగా రెండవ ఓటమి.

4, ఏప్రిల్ 2010, ఆదివారం

జయవర్దనె సెంచరీ,ఏట్టకెలకు పంజాబ్ కు విజయం


పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ కోల్కతకు షాక్ ఇచ్చింది.మొదట బ్యాటింగ్ చెసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కొర్ సాదించింది. ఓపనర్లు గంగూలీ 36 పరుగులు,గేల్ 42 బంతుల్లో 8 సిక్సర్లు 6 పొర్లతో 88 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నైట్ రైడర్స్ భారీ స్కొర్ సాదించింది.తరువాత బ్యాటింగ్ చెసిన పంజాబ్ ఆరంభం నుంచె బౌలర్లపై ఎదురుదాడి చెసింది.ఓపనర్ జయవర్దనె 59 బంతుల్లో 3 సిక్సర్లు 14 పొర్లతో 110 పరుగులు చెసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర వహించాడు.ఆతనికి తోడుగా సంగక్కర, చివరిలో యువరాజ్ అండగా నిలబడటంతో పంజాబ్ 18.2 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో ఆలవోకగా గెలిచింది.

28, మార్చి 2010, ఆదివారం

చెన్నై పై రాజస్థాన్ రాయల్స్ విజయం

రాజస్థాన్ రాయల్స్ ఐ.పి.యల్లొ వరుసగా నాలుగవ మ్యచ్ గెలిచి పుంజుకుంది.ఈ రోజు చెన్నైతో జరిగిన మ్యచ్ లో 17 పరుగుల తేడాతో గెలిచింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఒవర్లలో 177 పరుగులు  చెసింది. ఓపనర్లు  లుంబ్ 16 బంతుల్లో 30 పరుగులు నామన్ ఒజా 49 బంతుల్లో 6 పోర్లు 5 సిక్స్ లతో 80 పరుగులు చెసి టాప్ స్కొరర్ గా నిలిచాడు.తరువాత బ్యాటింగ్ చెసిన చెన్నై ఆరంభంలో బాగా ఆడినా క్రమంగా వికెట్లు  కోల్పోయీ నిర్ణిత 20 ఒవర్లలో 160  పరుగులు చెసి ఓటమి చెవి చుసింది.చెన్నై జట్టులో హెడేన్ 42 పరుగులు,మోర్కెల్ 28 పరుగులు చెసారు.

21, మార్చి 2010, ఆదివారం

దెక్కన్ చార్జర్స్ హ్యట్రిక్ విజయం

దెక్కన్ చార్జర్స్ డిల్లితో జరిగిన మ్యచ్ లో గెలవటం ద్వార ఐ.పి.యల్లో హ్యట్రిక్ విజయాలను సొంతం చెసుకోంది.మొదట బ్యాటింగ్ చెసిన హైదరబాద్ నిర్ణిత 20 ఒవర్లలో 6 విక్కెట్ల నస్టానికి 171 పరుగులు చెసింది.రొహిత్ శర్మ 45 పరుగులు సైమండ్స్ 35 పరుగులు చెసారు. పరుగుల విజయ లక్స్యంతో బరిలొకి దిగిన డిల్లి విజయనికి 10 పరుగుల దురంలో నిలిచింది.9 విక్కెట్ల నస్టానికి 161 పరుగులు మాత్రమె చెసింది.డిల్లి జట్టులో వార్నర్ 57 పరుగులు,దినెష్ కార్తిక్ 46 పరుగులు చెసారు.      

20, మార్చి 2010, శనివారం

రాజస్తాన్ రాయల్స్ బోని

ఐ.పే.యల్1 విజేత రాజస్తాన్ రాయల్స్  3 ఓటమిలు తర్వాత యీ టోర్నిలో బోని చేసారు.కొలకత తో ఈరోజు జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ జట్టు 34 పరుగుల తేడాతో కోల్కతా ఫై నెగ్గింది.మూడట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణిత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది.అభిషేక్ జనజున్వాల 45 పరుగులు,ఆడం వోగేస్ 37 పరుగులు చేసారు.  తరువాత బ్యాటింగ్ చేసిన  కోల్కతా 5 వికెట్లు నష్టానికి 134 పరుగులు చేసి 34 పరుగులు  తేడాతో   ఓటమి చెవి చూసింది.

19, మార్చి 2010, శుక్రవారం

డిల్లి ఫై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఈరోజు జరిగిన ఐ.పే.ఎల్లో మ్యచ్చులో డిల్లి డేర్ డెవిల్స్ ఫై చెన్నై  సూపర్ కింగ్స్ 5 విక్కెట్ల తేడాతో నెగ్గింది.మొదట బ్యాటింగ్ చేసిన డిల్లి 6 విక్కెట్ల నష్టానికి  185 పరుగులు చేసింది.సెహ్వాగ్ 38 బంతుల్లో 74 పరుగులు చేసాడు.తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 బంతులు  మిగిలి ఉండగానే గెలిచింది.హేడెన్ 43 బంతుల్లో 93 పరుగులు,సురేష్ రైనా 34 బంతుల్లో 49 పరుగులు చేసి విజయంలో కీలక  పాత్ర వహించారు హేడెన్ మాన్ అఫ్ ది మ్యాచ్  అవార్డు లభించింది.

18, మార్చి 2010, గురువారం

బెంగుళూరు మరో విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు  ఐ.పే.ఎల్లో వరుసగా రెండవ బారీ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్  రాయల్స్ జట్టు వరుసగా మూడవ మ్యచ్చులో ఓటమి చెవిచూసింది.మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బెంగుళూరు బౌలర్ల ధాటికి 92 పరుగులకే కుప్పకూలింది. యూసఫ్ పటాన్ అత్యధికంగా 26 పరుగులు చేసాడు.ప్రవీణ్ కుమార్,అనిల్ కుంబ్లే చెరో 3 విక్కెట్లు కలిస్ 2 విక్కెట్లు తీసారు.93 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చెప్పట్టినా బెంగుళూరు విక్కెట్లేమి కోల్పోకుండా అలవోకగా విజయం సాధించింది.మనీష్ పాండే 42  పరుగులు కలిస్ 44 పరుగులు చేసి నాట్ అవుట్ తో  నిలిచారు.

16, మార్చి 2010, మంగళవారం

బెంగుళూరు సూపర్ విక్టరి

ఐ.పే.యల్  టోర్నిలో ఈరోజు కింగ్స్ 11 పంజాబ్, బెంగుళూరు  జట్ల మధ్య జరిగిన మ్యచ్చులో బెంగుళూరు జట్టు 8 విక్కెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది.మొదట  బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 203 పరుగులు చేసి 3 విక్కేట్లను కోల్పోయింది. రవి బోపర 77 పరుగులు,బిస్ల 75 పరుగులు చేసారు.తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 2 విక్కెట్లను మాత్రమే కోల్పోయీ విజయం సాధించిది. మనిష పాండే 38 పరుగులు, కలిస్ 89 పరుగులు,ఉతప్ప 51 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర  పోషించారు .

21, జనవరి 2010, గురువారం

యుట్యుబ్ లో ఐ.పీ.యల్3 మ్యచ్చులు

వచ్చే ఐ.పీ.యల్3  మ్యచ్చులను ఆభిమానులు  యుట్యుబ్లోనే చూడవచ్చు.దీనికి గూగుల్ తో లలిత్ మోడి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు .ఐతే ప్రత్యక్ష ప్రసారంతో  పోల్చితే 5  నిమిషాలు ఆలస్యంగా యుట్యుబ్ లో క్రికెట్ చూడవచ్చు.దీని ద్వారా ఇప్పటికే కాసులు కురిపిస్తున్నఐ.పీ.యల్.తో  బి.సి.సి.ఐ కి మరింత ఆదాయం వస్తుందీ.యీ లింక్ ద్వారా లాగిన్ ఆయీ మ్యచ్చులు చూడవచ్చు. www.youtube.com/ipl