31, అక్టోబర్ 2009, శనివారం

మూడవ వన్ డే లో ఇండియా గెలుపు,సిరిస్ లో ముందంజ


ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మూడవ వన్ డే లో ఇండియా 6 విక్కెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఫై గెలుపొందింది. మొదటబ్యాటింగ్ చేసిన ఆసిస్ 50 ఓవర్లలో 5 నష్టానికి 229 పరుగులు చేసారు.ఆసిస్ జట్టులో హుస్సీ [81],పాంటింగ్ [59]హాఫ్సెంచిరిలు చేసారు.ఇండియా బౌలర్లలో జడేజా 2 వికెట్లు, హర్భజన్,యువరాజ్,రైనా తల ఒక వికెట్ తీసుకున్నారు.

తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఆరంభంలో త్వరగానే 3 వికెట్లు నష్టపోయిందీ.సచిన్ 32 పరుగులు,సెవాగ్ 11 పరుగులు ,గంభీర్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు.తర్వాత వచ్చిన యువరాజ్, ధోని మరో వికెట్ పడకుండా స్కోరుబోర్డు పెంచారు.ఇద్దరు కలసి 4 వికెట్కు 148 పరుగులు జోడించి ఇండియా
విజయాన్ని ఖాయం చేసారు.యువరాజ్సింగ్ 78 పరుగులు చేసాడు ఇందులో 2 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయీ.ధోని 71 పరుగులు చేసి చివర వరకు నాట్
అవుట్ నిలిచాడు.ఈవిజయంతో ఇండియా 2-1 తో ఆధిక్యంలో ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి